ధర్మదీక్షకు సిద్ధమేనా?
ఒకసారి బుద్ధుడు విశాల •వటవృక్షం కింద కూర్చుని జ్ఞానబోధ చేస్తున్నాడు. అందరూ భక్తిశ్రద్ధలతో ఆ బోధనలు వింటున్నారు. అంతలో అక్కడికి రాజభటులు ఒక దొంగను తీసుకువచ్చారు. రాజభటులు బుద్ధుడికి వినయంగా నమస్కరించి- - ‘భగవాన్! ఈ దొంగ గతంలో మీ వద్ద ధర్మదీక్ష తీసుకున్నట్టు చెబుతున్నాడు. మహారాజు వాస్తవం ఏమిటో కనుక్కోమని మమ్మల్ని పంపారు’ అని చెప్పారు. బుద్ధుడు ఆ దొంగకేసి కొద్దిసేపు చూశారు. ‘నీ పేరు ఏమిటి?’ అడిగాడు బుద్ధుడు. ‘ధర్ముడు’ అని చెప్పాడు దొంగ. ‘నువ్వు