వస్తుగుణ దీపిక

బ్రాంది:
దీనిని మితంగా తీసుకుంటే మనోల్లాసం కలుగుతుంది. పొట్టకు బలాన్ని చేకూరుస్తుంది. వేడి చేస్తుంది. పురటాళ్లకు మంచిది. శరీర శ్రమను, వంటి నొప్పులను పోగొడుతుంది. చెవిపోటు అనిపించినపుడు చెవిలో కొద్దిగా పోసుకుంటే పోటు తగ్గుతుంది. అలాగే చెవిలో నొప్పి కూడా తగ్గుతుంది. నరాలకు సత్తువనిస్తుంది. పంటినొప్పి, చిగుళ్ల వాపు ఉన్న వారు దీనిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే నొప్పి తగ్గి, చిగుళ్ల వాపు కూడా పోతుంది. అజీర్ణాన్ని పోగొడుతుంది.

భూశర్కర దుంప:
తియ్యగా ఉంటుంది. మేహశాంతి, దేహపుష్టి, వీర్యపుష్టిని కలిగిస్తుంది. శరీర తత్వాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది. రోగులకు దీని కషాయం మేలు చేస్తుంది. వివిధ అనారోగ్యాలతో బాధ పడుతున్న వారు ఈ కషాయం తీసుకుంటే మంచిది. ప్రతి రోజూ ఈ కషాయం తీసుకుంటే అనారోగ్యం అన్నమాటే ఉండదు.

మంచి గంధం:
దీనిని శ్రీగంధమని, పీతచందనమని కూడా వ్యవహరిస్తారు. దీని చూర్ణం లేదా కషాయం వగరు, చేదు రుచులను కలిగి ఉంటుంది. ఇది చలువ కలిగించి వేడి చేస్తుంది. మనోహరంగా ఉంటుంది. సువాసన వెదజల్లుతుంది. కళ్లకు చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెడు రక్తాన్ని హరిస్తుంది. వీర్యవృద్ధి, కాంతినిస్తుంది. తాపం, దాహం, జ్వరం, అతిసారం, కఫం, అరుచి, దురదలు, పొక్కులు, భ్రమ, జలుబు, వాతం, పైత్యం, శ్రమ, చర్ది, ఎక్కిళ్లను హరిస్తుంది. దీని చూర్ణాన్ని నీళ్లలో కలిపి ఇస్తే తాపం తగ్గుతుంది.

మందార చెట్టు:
దీనిని దాసాని చెట్టు అని కూడా వ్యవహరిస్తారు. దీని ఆకులకు ఆముదాన్ని పూసి వేడి చేసి వాటిని గడ్డల మీద వేస్తే.. గడ్డలు హరించి మృదువు అవుతాయి. అణగిపోతాయి. నొప్పి పోతుంది. మందార ఆకుల పసరును లోపలికి తీసుకుంటే మూత్రం బాగా జారీ అవుతుంది. ఇది మంచి విరేచనకారి.

మందారపువ్వు:
దీనిని దాసాని పువ్వు అనీ, జపా పువ్వు అనీ కూడా పిలుస్తారు. ఈ పువ్వు రేకులతో చేసిన తేలికపాటి కషాయం గాని, పాకం గాని గుండెకు మంచి బలాన్నిస్తుంది. మృదువు పరుస్తుంది. మర్మావయవాల్లో మంటను, నొప్పిని పోగొడుతుంది. ఆలివ్‍ ఆయిల్‍లో గాని, కొబ్బరినూనెలో గాని వాటి నూనెకు సమానంగా మందారపువ్వు రసాన్ని పోసి, అందులోని నీరు ఇగిరిపోయే వరకు వేడి చేసి దానిని తలకు రాసుకుంటే జుత్తు పెరుగుతుంది. జుట్టు ఊడదు.

మదనానబ చెట్టు:
దీనినే వ్యావహారికంలో బొప్పాయి చెట్టు అని వ్యవహరిస్తారు. దీని పువ్వు నలిపి పేను కొరికిన చోట రుద్దితే మానిపోతుంది. అయితే నాలుగు అయిదు రోజుల పాటు ఇలా రుద్దాలి. దీని చెట్టు నుంచి కారే పాలు రెండు మూడుసార్లు పూసుకుంటే తామర, గజ్జి, చిడుము వంటివి మానిపోతాయి. పచ్చికాయను వండుకుని తింటే స్త్రీలకు పాలు పడతాయి. ఈ కూర వాతాన్ని, వంటిలోని నీటిని కూడా హరిస్తుంది. పచ్చికాయను కొబ్బరికోరు వలే తరిగి కట్టినా, ఉడికించి దంచి కట్టినా హైడ్రోసిల్‍ వాపు, నొప్పి తగ్గిపోతాయి.

మదనానబ పండు:
ఇదే బొప్పాయి పండు. తియ్యగా, రుచిగా ఉంటుంది. చలువ చేసి నీరు పెంచుతుంది. రక్తస్రావాన్ని, రక్తం పడే మూలవ్యాధిని, మూత్రద్వారంలో పుట్టిన వ్రణాలను మాన్పుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే బొప్పాయి పండు ముక్కలను తీసుకుంటే మంచిది. గుండెకు, పొట్టకు బలాన్నిస్తుంది. ఇది కొంచెం ఆలస్యంగా జీర్ణం అవుతుంది. అయితే, మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది.

మరువం:
దీనిని సువాసన కోసం స్త్రీలు ఎక్కువగా అలంకరించుకుంటారు. దీని రసం, కషాయం లేదా చూర్ణం సువాసన కలిగి ఉంటుంది. రుచికి చేదుగా, వగరుగా ఉంటుంది. వేడి చేస్తుంది. క్షయను పోగొడుతుంది. దాహాన్ని, తాపాన్ని అణచివేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంద్రియపుష్టి కలుగచేస్తుంది. కామేచ్ఛను వృద్ధి పరుస్తుంది. దీనిని తలకు రాసుకునే నూనెలో వేసి కాచి వాడితే సువాసనగా ఉండటమే కాక మెదడుకు చలువను కలిగించి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

మర్రిచెట్టు:
ఈ చెట్టు కషాయం గాని చూర్ణం గాని తీసుకుంటే అజీర్ణం, ఉబ్బు పోతాయి. బలం కలుగుతుంది. అతి మూత్రవ్యాధి పోతుంది. దీని గంధాన్ని చిరకాలం తీసుకోగలిగితే ఆయుర్వ•ద్ధి ప్రాప్తిస్తుంది.

మర్రి ఆకులు:
ఈ ఆకుల రసం లేదా కషాయం విరేచనాలను అరికడుతుంది. రక్తపైత్యాన్ని అణచి, మేహశాంతిని కలుగచేస్తుంది.

Review వస్తుగుణ దీపిక.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top