తెలివైన వర్తకుడు.. తెలివితక్కువ తాబేలు
జాతక కథలు రెండు రకాలని చెప్పుకున్నాం కదా.. అవి- వర్తమాన కథలు, అతీత కథలు. అందుకు ఒక ఉదాహరణ.. ఒకనాడు అనాథ పిండక శ్రేష్ఠి జేతవనంలో ఉన్న బుద్ధుడి వద్దకు వచ్చి తన మిత్రులు కొందరు బుద్ధుడు బోధించిన మార్గం విడిచి వేరే మార్గంలోకి వెళ్లారన్న విషయం చెబుతాడు. ఇది వర్తమాన కథ. ఈ వర్తమాన కథను పురస్కరించుకుని బుద్ధుడు ఆ సందర్భంలో తన ఒకనాటి పూర్వజన్మలో జరిగిన సంఘటన గురించి చెబుతాడు.