భక్తిని తెంచి.. ముక్తిని పొంది
రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ కాలం తీవ్రమైన భక్తుడిగానే జీవించారు. ఆయన కాళిమాత భక్తుడు. ఆయనకు కాళి ఒక దేవత కాదు. సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది. ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. తరువాత ఆయనను పరమానంద అనుభూతిలో వదిలేసేది. మరి, ఇటువంటి పరమ భక్తాగ్రేసరుడైన రామకృష్ణులు తరువాత కాలంలో పరమ యోగిగా ఎలా మారారు? ఇది ఆసక్తికరం.




