మాటల్లో తెలుగు పాలెంత?
మనం నిత్యం ఎన్నో మాటలు మాట్లాడు తుంటాం. ఆ మాటల్లో ఎన్నో పదాలు పలుకు తుంటాం. వాటిలో చాలా వరకు పదాలు ‘తెలు గు’వే అనుకుంటాం. నిజానికి ఒకసారి అటువంటి పదాలను తరచి చూస్తే.. మనం మాట్లాడే భాషలో తెలుగు పాలెంతో తెలిసి వస్తే ఆశ్చర్యం కలగక మానదు. అసలు మనం మన తెలుగును మనం గౌరవించుకుంటూ ‘మాతృభాష’ అని సంబోధిస్తుంటాం. కానీ, ‘భాష’ అనే పదం సంస్క•తం. అంతెందుకు? ‘దేవుడు’.




