శ్రీ మహాగనేష్ పంచరత్నం
జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచిత గణేశ పంచరత్నం ఇది. వినినా, చదివినా చాలా పవిత్రమైన భావనలను కలిగించి, ఆధ్యాత్మిక జగతిలో విహరింప చేసే ఈ రత్నాకరం అర్థతాత్పర్యం.. ముదా కరాత్తమోదకం సదావిముక్తి సాధకం । కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం -- అనాయకైక నాయకం విశాశితే భదైత్యకం - నతా శుభా శునాశకం నమామి తం వినాయకమ్ ।। ఆనందంతో భక్తులు సమర్పించిన మోదకాలను స్వీకరించి, భక్తులకు మోక్షమును ప్రసాదించి, చంద్రుడిని శిరోభూషణంగా ధరించి,