రామయ్య తండ్రీ… ఓ రామయ్య తండ్రీ…
ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలూ, సుఖాలను విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్య వాసం చేశాడు. కష్టనష్టాలకు వెరవక తాను నమ్మిన సత్య, ధర్మ మార్గాలను అనుస రించాడు. ఒక మంచి కొడుకులా, భర్తలా, ఆత్మీయతను పంచే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ...ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో వారితో




