‘కొడుకు పేరు సోమలింగం’
విజయం అనేది కల నుంచే పుడుతుంది. కల కన్నప్పుడే ఆ కలను నిజం చేసుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే, కలకు పగటి కలకు మధ్య రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ దాటితే కల కాస్తా పగటి కలై అపహాస్యం పాలవుతుంది. ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ కొందరు పగటి కలలు కంటుంటారు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఆ పని తాలూకు విజయాన్ని కలలోనే సొంతం చేసుకుని ఆనందిస్తుంటారు. ఇలాంటి