కార్తీకమాస విశేషాలు

ఔషధ గుణాలున్నాయి. ఉసిరికాయతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి అనేక విధాల మేలు కలుగుతుంది. ఉసిరిక శీతగుణం కలది. తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. కార్తీక సోమవారం: కార్తీక సోమవారం శివుడికి అత్యంత

చీమ మంచితనం

అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. చెట్టుపైన పిట్టగూడు. ఆ గూటిలో పావురాల జంట. ఆ పావురాలు రెండూ కలిసికట్టుగా ఆహారం కోసం వెళ్లేవి. తిరిగి చీకటి పడే వేళకు గూటికి చేరి ఊసులాడుకుంటూ ఒకదానికొకటి ఆహారం తినిపించుకునేవి. ఆ చెట్టు కింది పుట్టలో ఒక గండు చీమ. పాపం. అది ఒంటరిది. దానికి నా అనే వాళ్లెవరూ లేరు. రోజూ పావురాల జంట ఆనందంతో

చిలక పలుకులు

అక్బర్‍ చక్రవర్తికి వేటాడటం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవిలోని జంతువులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‍ను ఎంతగానో బాధించింది. బీర్బల్‍ ఈ విషయాన్ని అక్బర్‍ చక్రవర్తి దృష్టికి తీసుకురావాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఒకరోజు అక్బర్‍ తన పరివారంతో కలిసి వేటకు వెళ్లాడు. బీర్బల్‍ కూడా అతని వెంట ఉన్నాడు. అడవికి వెళ్లే తోవలో వారు ఒక చిలకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు.

ప్రతి ధ్వని

ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాదిగా సమాధానం చెబుతున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో ‘అమ్మా’ అని అరిచాడు రఘు. అతను అరవకున్నా ఆ కొండ ప్రాంతంలో మరోసారి ‘అమ్మా’ అనే శబ్దం వినబడటంతో రఘు ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండలలో నుంచి రావడాన్ని

బ్రహ్మ శిల్పి

స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలను అన్నింటినీ సృష్టించిన తనను భూలోక వాసులు గుర్తుపెట్టుకున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదు ఎంత? అని శిల్పిని అడిగాడు బ్రహ్మ.

Top