జీవితమంటే..
జీవితం అంటే వీధి పోరాటం కాదు. దానిని చిల్లరగా తీసుకుని కల్లోల పరచుకోకూడదు. జీవితం అంటే ఒక ఆట. దానిని స్ఫూర్తిగా తీసుకుని జీవించాలి. ఎదురుదెబ్బలు, ఓటమి లేని జీవితం అంటూ ఉండదు. అంతమాత్రాన అల్లాడి పోకూడదు. జీవితం అక్కడితో ముగిసిపోయిందని బెంబేలెత్తి పోకూడదు. రావణుడు సీతాదేవిని అపహరించుకు పోతున్నాడు. ఈ దృశ్యం జటాయువు కంట బడింది. అపరలక్ష్మీదేవి వంటి సీతమ్మ అపహర ణకు గురవుతోందని జటాయువు (పక్షి) గ్రహిం చాడు.




