చీమ మంచితనం

అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. చెట్టుపైన పిట్టగూడు. ఆ గూటిలో పావురాల జంట. ఆ పావురాలు రెండూ కలిసికట్టుగా ఆహారం కోసం వెళ్లేవి. తిరిగి చీకటి పడే వేళకు గూటికి చేరి ఊసులాడుకుంటూ ఒకదానికొకటి ఆహారం తినిపించుకునేవి. ఆ చెట్టు కింది పుట్టలో ఒక గండు చీమ. పాపం. అది ఒంటరిది. దానికి నా అనే వాళ్లెవరూ లేరు. రోజూ పావురాల జంట ఆనందంతో కువకువలాడటం చూసేది. వాటితో స్నేహం చేయాలని అనుకుంది గండుచీమ. ఒకరోజున పావురాలతో ఇలా అంది-
‘మిత్రులారా! కష్టసుఖాలు చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు. నేను మీతో స్నేహం చేయవచ్చా?’.
చీమ మాటలకు పావురాలు రెండూ ఫక్కున నవ్వాయి.

‘నేల మీద నడిచే నువ్వెక్కడ? ఆకాశంలో విహరించే మేం ఎక్కడ? మేం తెల్లగా, అందంగా ఉంటాం. నువ్వేమో నల్లగా, అసహ్యంగా ఉంటావు. నీకూ మాకూ పొంతన లేదు. నీతో మేం స్నేహం చేయం’ అని పావురాలు తెగేసి చెప్పాయి. చీమ బాధపడి ఊరుకుంది.

ఒకరోజు ఒక తుంటరి పిల్లాడు ఆ చెట్టు వద్దకు వచ్చి, ఉండేలు తీసి, పావురాలకు గురిపెట్టి కొట్టబోయాడు. చీమ అది గమనించి మెల్లగా వెళ్లి చటుక్కున వాడి పాదం మీద కుట్టింది. పాదం మీద ఒక్కసారిగా చురుక్కుమనే సరికి, పిల్లాడి ఏకాగ్రత దెబ్బతిని ఉండేలులోని రాయి గురి తప్పింది. ఆ అలికిడికి పావురాలు రివ్వున ఎగిరిపోయాయి.

ఇక చేసేది ఏమీ లేక ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ పిల్లాడు వెళ్లిన కొద్దిసేపటికి పావురాలు తిరిగి ఆ చెట్టు మీదకు వచ్చి ‘చీమా! నువ్వెంత మంచిదానివి? మేం నిన్ను చులకనగా మాట్లాడినా, మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడావు. ఇక నుంచి మనం మంచి స్నేహితులుగా ఉందాం’ అన్నాయి. పావురాళ్లతో చెలిమి కుదరడంతో చీమ చాలా సంతోషించింది.

నీతి: స్నేహానికి పరిమాణం, ఎత్తు, పొడవు వంటివి కొలమానం

Review చీమ మంచితనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top