ప్రాణం తీసిన దురాశ

సంస్క•త భాషలో అద్భుతమైన నీతి కథలను నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. ‘హితోపదేశం - మిత్రలాభం’లో నారాయణ కవి చెప్పిన గొప్ప నీతి ఉన్న చిన్న కథ ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్లి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించుకునే వాడు.

రామలింగడు.. నలుగురు దొంగలు

శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. తన చమత్కారాలు, సమయస్ఫూర్తితో రాయల వారిని సంతోషపరిచి ఎన్నో బహుమతులు పొందేవాడు. ఒకసారి నలుగురు పేరుమోసిన దొంగలు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయ్యింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి వెళ్లాడు. అనుకోకుండా అరటి చెట్లు వైపు

కాకి లెక్కలు

ఒకరోజు ఉదయం బీర్బల్‍ రాజదర్బారుకు వెళ్లే సరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లను ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్ధమయ్యింది బీర్బల్‍కు. అతను నెమ్మదిగా చక్రవర్తి వద్దకు వెళ్లి, ‘విషయం ఏమిటి జహాపనా?’ అని అడిగాడు. ‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకు పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’ అన్నాడు అక్బర్‍ కోపంగా. ‘అసలు సంగతేంటి జహాపనా?’ అన్నాడు

చీమ – మిడత

ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచి పెట్టుకోవడంలో నిమగ్నమై ఉండేది. మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని, పాడుచేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది. ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న

నమ్మకద్రోహం

ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద గల బొరియలో నక్క నివాసం ఏర్పర్చుకుని జీవిస్తోంది. కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే, ఒకరోజు నక్క ఆహారం కోసమని అడవిలోకి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ

Top