కాకి లెక్కలు

ఒకరోజు ఉదయం బీర్బల్‍ రాజదర్బారుకు వెళ్లే సరికి అందరి ముఖాలూ దిగాలుగా కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లను ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని, దానికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్ధమయ్యింది బీర్బల్‍కు.

అతను నెమ్మదిగా చక్రవర్తి వద్దకు వెళ్లి, ‘విషయం ఏమిటి జహాపనా?’ అని అడిగాడు.
‘మన రాజ్యంలో విషయాలేవీ మన మంత్రులకు పట్టడం లేదు. ఇలా అయితే మన రాజ్యం నడపలేం’ అన్నాడు అక్బర్‍ కోపంగా.
‘అసలు సంగతేంటి జహాపనా?’ అన్నాడు బీర్బల్‍.
‘మన రాజ్యంలో అసలు కాకులు ఎన్ని ఉన్నాయో అని వీళ్లని అడిగితే ముఖాలు వేళ్లాడేసుకుని తెలియదు అంటున్నారు’ అన్నాడు చక్రవర్తి.
‘ఓస్‍ అంతేనా?’ అన్నాడు బీర్బల్‍.
‘నీకు తెలుసా?’ అడిగాడు చక్రవర్తి.
‘ఓ! మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులు ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టించండి’ అని బదులిచ్చాడు బీర్బల్‍.
‘అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు? ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే..?’ అని ప్రశ్నించాడు అక్బర్‍.
‘మన రాజ్యంలో ఉన్న కాకులను చూడటానికి పక్క రాజ్యాల నుంచి వాటి చుట్టాల కాకులు వచ్చి ఉంటాయి ప్రభూ!’.
‘అలాగా! మరి తక్కువ ఉంటే..?’ మళ్లీ ప్రశ్నించాడు అక్బర్‍.
‘ఉండొచ్చు ప్రభూ! మన కాకులు వాళ్ల చుట్టాలను చూడటానికి పక్క రాజ్యాలకు వెళ్లి ఉండవచ్చు కదా?’ అన్నాడు బీర్బల్‍.
బీర్బర్‍ కాకి లెక్కల చమత్కారానికి అక

Review కాకి లెక్కలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top