ఉత్తరాయణం

కొత్త సందేశం వసంతానికి స్వాగతం పలుకుతూ చదువుల తల్లి సరస్వతిని పూజిస్తూ జరుపుకునే శ్రీపంచమి వేడుక గురించి తెలుగు పత్రిక ఫిబ్రవరి 2024 సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ‘జగత్తంతా సరస్వతీ మాతను ఆశ్రయించి జీవిస్తోంది. ఆ తల్లి పాదాలను నమ్ముకుని నేను జీవిస్తున్నాను’ అనేది నూటికి నూరుపాళ్లు నిజం. వసంత రుతు వర్ణనలు, సరస్వతీ దేవి మహత్తుల గురించి ఈ ప్రత్యేక కథనంలో బాగా వివరించారు. - కె.రాహుల్‍, సి.హరిప్రసాద్‍,

ఉత్తరాయణం

కొత్త సందేశం తెలుగు పత్రిక జనవరి 2024 సంచికలో కొత్త సంవత్సరం సందర్భంగా అందించిన ప్రత్యేక కథనం చాలా బాగుంది. ప్రతి భాషలోనూ, ప్రతి సంస్క•తిలోనూ పలకరింపు అనేది ఎంతో ముఖ్యమైనది. దానిని సరిగా ఉపయోగించడం నేర్చుకుంటే, అది మనల్ని మనిషిగా ఓ మెట్టు పైన ఉంచుతుందనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించారు. కొత్త సంవత్సరం వేళ కొత్త విషయాలను అందించినందుకు అభినందనలు. - బి.హరినాథ్‍, కె.భిక్షపతి, హరిప్రసాద్‍, టి.ఎస్‍.నవీన్‍, శ్రీకాంత్‍ మరికొందరు

ఉత్తరాయణం

సమస్తం.. పుస్తకం తెలుగు పత్రిక డిసెంబరు 2024 సంచికలో పుస్తక మహోత్సవం శీర్షిక కింద పుస్తకాలు చదవాల్సిన అవసరం గురించి, జీవితంలో తప్పక చదవాల్సిన తెలుగు పుస్తకాలు, తెలుగు అనువాదాల గురించిన వివరాలు చాలా చాలా బాగున్నాయి. ప్రస్తుతం అందరిలోనూ చదివే అలవాటు తగ్గిపోతుంది. ఈ శీర్షికలో అక్షరాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవచ్చో చక్కగా వివరించారు. అలాగే తప్పక చదవాల్సిన పుస్తకాల వివరాల జాబితా బాగుంది. ప్రతి ఒక్కరు భద్రంగా దాచుకోవాల్సిన

ఉత్తరాయణం

కార్తీక దీపశోభ తెలుగు పత్రిక నవంబర్‍ 2023 సంచికలో కార్తీక శోభ ఉట్టిపడింది. ఆ మాస విశేషాలను తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చదివించింది. కార్తీకంలో హరిహరుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కార్తీక మాస విధులు, వ్రత కథలతో అందించిన ఈ కథనం బాగుంది. - పి.సంతోష్‍కుమార్‍, అనన్య, కవిత, రేవతి, సుధాకరరావు, వెంకటరమణ, ఆన్‍లైన్‍ పాఠకులు నీతి కథలు వరుసగా ప్రతి సంచికలో అందిస్తున్న నీతి కథలు చదివిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని నీతి కథలను

ఉత్తరాయణం

గ‘ఘన’ విజయం భారత్‍ అంతరిక్ష పరిశోధనల్లో మరో చరిత్రాత్మక తేదీని నమోదు చేసింది. ఆగస్టు 23న చంద్రయాన్‍-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్‍-2 వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్‍-3 ప్రాజెక్టును చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాగించిన అద్వితీయ ప్రయత్నాలను తెలుగు పత్రిక అక్టోబరు 2023 సంచికలో ముఖచిత్ర కథనం కింద అందించడం బాగుంది. - వైశాలి,

Top