ఉత్తరాయణం
ఆరోగ్య ‘జ్యోతి’ అటు ఆరోగ్యాన్ని కలిగిస్తూ.. ఇటు సామాజిక స్ఫూర్తిని రగిలిస్తూ.. సత్యం వైపు నడిపించే అయ్యప్ప స్వామి దీక్షాధారణ గురించి డిసెంబరు తెలుగుపత్రిక సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ముఖ్యంగా యాత్ర సాగే విధానం, అక్కడి విశేషాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది రకాల భావాలకు ప్రతీక అని ఈ ముఖచిత్ర కథనం చదివిన తరువాతే తెలుసుకున్నాం. - బాలాజీ నాయక్, జి.సోమసుందర్, కె.పి.కిశోర్, లలితకుమారి,




