ఉత్తరాయణం
మహాలక్ష్మీ నమోస్తుతే! తెలుగు పత్రిక ఆగస్టు సంచికలో వరలక్ష్మీ వ్రత దినం సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ఆ మహాలక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది? ఎలాంటి వారిని దూరం పెడుతుంది? ఎక్కడ కొలువై ఉంటుంది? అనే విశేషాలను ఎంతో విపులంగా వివరించారు. శ్రావణ మాస శుభవేళ లక్ష్యసిద్ధిని కలిగించే ఆ సిద్ధిధాత్రి గురించి ఇచ్చిన ఈ ప్రత్యేక కథనం ఎంతగానో చదివించింది. - ఎస్.శ్రీకాంత్, రాజా రమేశ్,




