ఉత్తరాయణం

పెరటి వైద్యం మన ఇంటి పెరటిలోనే పెంచుకోదగిన ఔషధ మొక్కలు, వాటి సాయంతో తగ్గించుకోగల వివిధ వ్యాధుల గురించి తెలిపిన తెలుగు పత్రిక మే 2023 సంచికలోని ఆరోగ్య భాగ్యం శీర్షిక ఎంతగానో బాగుంది. మన భారతీయ సంప్రదాయంలోని పెరటి చెట్టు, వంటగది ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిపే కథనమిది. - ఆర్‍.శేషగిరిరావు, ఎ.శ్రీనివాస్‍, ఆనంద్‍సాయి- హైదరాబాద్‍ వైశాఖ విశేషం తెలుగు పత్రిక మే 2023 సంచికలో వైశాఖ మాసం గురించి అందించిన విశేషాలు బాగున్నాయి.

ఉత్తరాయణం

దాచుకున్నాం.. తెలుగు పత్రిక మార్చి 2023 సంచికలో అందించిన విక్రమార్క భేతాళ కథలు చాలా బాగున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కథలు.. మళ్లీ ఆ రోజుల్ని, నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఈ తరం పిల్లలకు తప్పక తెలియాల్సిన, తప్పక చదవాల్సిన కథలివి. సంచిక మొత్తం 25 కథలు అందించడం ద్వారా లైబ్రరీ కాపీగా భద్రపరుచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. - రావు బాలకృష్ణ, కె.మహేశ్‍, ఆర్‍.లింగేశ్వరరావు, కపిల్‍, పి.రాధాకృష్ణ, రాజారావు, దయాకరరావు

ఉత్తరాయణం

ఆలోచింపచేశాయి.. నేడు ప్రపంచంలో పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలుగు పత్రిక డిసెంబరు- 2022 సంచికలో కళ్లకు కట్టారు. అనగనగా.. అంటూ కథలు వింటూ నిద్రలోకి జారుకునే కాలం నుంచి స్మార్ట్ఫోన్‍ను పక్కలో పెట్టుకుని పడుకునే కాలంలోకి ప్రవేశించిన మనం మళ్లీ మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని ముఖచిత్ర కథనం ద్వారా బాగా వివరించారు. - కె.ఉమాకాంత్‍, ఆర్‍.వెంకటేశ్వరరావు, సి.అప్పలరాజు, కేఆర్‍ సురేశ్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు (హైదరాబాద్‍) అన్వేషణ భగవంతునిపై

ఉత్తరాయణం

కార్తీక విశేషాలు తెలుగు పత్రిక నవంబరు సంచికలో కార్తీక మాస విశేషాల గురించి చాలా బాగా వివరించారు. ముఖ్యంగా తెలుగు పత్రిలో వివిధ శీర్షికల ద్వారా తెలియని అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. కార్తీక మాసానికి కార్తీకం, బాహులం, ఊర్జం, కార్తికికం అనే పేర్లు ఉన్నాయని తెలుసుకోవడం ఆసక్తి కలిగించింది. - శ్రీనివాసరావు, కె.బాలకృష్ణ, ఆర్‍.సందీప్‍, కవిత, పి.ఆర్‍.రామకోటేశ్వరరావు, మరికొందరు పాఠకులు (హైదరాబాద్‍) శివకేశవుల కార్తీకం హరిహర తత్వాల మధ్య ఉండే అన్యోన్యతను, ఏకత్వ

ఉత్తరాయణం

ఇంత కథ ఉందా? అక్టోబరు సంచికలో ముఖచిత్ర కథనం బాగుంది. విజయదశమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ క్షేత్ర పాశస్త్యం గురించి మునుపెన్నడూ వినని, తెలియని, చదవని విషయాలు తెలుసుకున్నాం. మన విజయవాడ క్షేత్రం వెనుక ఇంత విశేషం ఉందా? అని ఆశ్చర్యమేసింది. కథనం ఎంతగానో చదివించింది. ఇలాంటి కథనాలు తరచుగా అందించండి. - అమర్‍, నందీశ్వరరావు, నాగరాజారావు, విజయవాడ, ఉమాపతి, ఆర్‍.వెంకటాద్రి- హైదరాబాద్‍, మరికొందరు పాఠకులు యువ ఔత్సాహిక దర్శకుడు దీపక్‍రెడ్డి

Top