ఉత్తరాయణం

కార్తీక విశేషాలు
తెలుగు పత్రిక నవంబరు సంచికలో కార్తీక మాస విశేషాల గురించి చాలా బాగా వివరించారు. ముఖ్యంగా తెలుగు పత్రిలో వివిధ శీర్షికల ద్వారా తెలియని అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. కార్తీక మాసానికి కార్తీకం, బాహులం, ఊర్జం, కార్తికికం అనే పేర్లు ఉన్నాయని తెలుసుకోవడం ఆసక్తి కలిగించింది.

– శ్రీనివాసరావు, కె.బాలకృష్ణ, ఆర్‍.సందీప్‍, కవిత, పి.ఆర్‍.రామకోటేశ్వరరావు, మరికొందరు పాఠకులు (హైదరాబాద్‍)

శివకేశవుల కార్తీకం
హరిహర తత్వాల మధ్య ఉండే అన్యోన్యతను, ఏకత్వ భావనను అవగతం చేసుకోవడానికి, శివుడు – కేశవుడు ఇద్దరూ ఒకటేనని సత్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం. ఈ విషయాన్ని గత సంచికలో ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. అభినందనలు.

– రాజేశ్వరరావు, ఆర్‍.నగేశ్‍, జి.వెంకటేశ్‍ ప్రసాద్‍- తిరుపతి, పావని- కర్నూలు, రమేశ్‍బాబు- విశాఖపట్నం

జ్యోతిషం..ఆరోగ్యం
ఆరోగ్యభాగ్యం శీర్షిక కింద ఆయుర్వేదానికి,.. జ్యోతిష శాస్త్రానికి మధ్య సంబంధాన్ని, సమన్వయాన్ని వివరిస్తూ అందించిన శీర్షిక చదివించింది. మన ప్రాచీన ఆయుర్వేద రహస్యాలను సరళంగా అందిస్తున్నారు.

– సత్యచంద్ర, హైదరాబాద్‍

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top