చిత్రం.. భళారే చైత్రం

ఈ సృష్టి ఎంత ‘చైత్ర’మైనదో కదా? అటు సంవత్సరారంభ దినం ఉగాది.. ఇటు జగదానందకారమైన సీతారాముల కల్యాణం.. ఒకటి ఆనందోత్సాహాల పర్వం.. ఇంకొకటి ఆధ్యాత్మిక పరవశ ఘట్టం.. మనం మంచి పనులు చేసేటపుడు, శుభకార్యాలు తలపెట్టినపుడు చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా, శుభకరంగా ఉండేలా చూసుకుంటాం. కానీ, ఇటువంటి ఏర్పాటును ఉగాదికి ప్రకృతే కల్పిస్తుంది. కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా ప్రకృతి కొత్త రూపు సంతరించుకుంటుంది. వసంత గాలులు.. కోయిలల మధుర గానాలు.. మావిచిగుళ్ల మిళమిళలు.. వేపపూల కళకళలు.. ఎటుచూసినా కొత్త

రామ నామం తారక మంత్రం

భారతదేశం ప్రాచీన కాలం నుంచి పాలించి, పెంచిన కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, ధార్మిక బాధ్యతలు, ఆచార వ్యవహారాలు, తత్వచింతన, జీవనరీతులు, సామాజిక వ్యవస్థ.. ఇవన్నీ ఒక్క రామాయణంలోనే చిత్రీకరించాడు వాల్మీకి తన రామాయణంలో!. అందుకే రామాయణం ‘భారత జాతీయ మహా ఇతిహాసం’గా ప్రసిద్ధి చెందింది. ఇది మత గ్రంథం. విశ్వ మానవుడికి యుగాల పూర్వమే భారతదేశం అందించిన మహాదర్శం. దానిని మనం కాపాడుకుంటూ ఆచరించి చూపడమే మనలోని రామభక్తికి

దేవ దేవ ధవళాచల మందిర..

చిత్రం: భూకైలాస్‍ (1958) సంగీతం: ఆర్‍.సుదర్శనం, ఆర్‍.గోవర్ధనం సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో । దేవ దేవ ।। పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమోనమో ।। దేవ దేవ ।। దురిత విమోచనా.. ఆఆ.. ఆఆ.. ఆఆఆ.. ఆఆ..ఆ.ఆ దురిత విమోచన ఫాలవిలోచన

శివుడు, యముడు పక్కపక్కనే..

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం- కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.. పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుండటంతో ఈ దేవాలయం ఒక్కసారిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా మహదేవ్‍పూర్‍ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమణీయమైన ప్రకృతి మధ్య, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన

మనసంతా శివం శివం

ఐదు అక్షరాల మంత్రం.. దాన్ని జపించాలంటే ఉండాలి అదృష్టం.. అదే శివ పంచాక్షరీ మంత్రం. ‘ఓం నమ:శివాయ’ అనే ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి స్తోత్రాన్ని రచించారు జగద్గురువు ఆదిశంకరులు. ఈ పంచాక్షరీ మంత్రం పఠిస్తూ ఉంటే సాక్షాత్తూ శివుడే ఆయా రూపాల్లో మన ఎదుట సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతుంది. ఓం నాగేంద్రహాయార త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘న’ కారాయ నమ: శివాయ

Top