ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో అందాలు
హోలీ పండుగ మనకు ఎన్నో నేర్పుతుంది. ఉగాదికి కాస్త ముందు.. వసంతాగమనానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకునే ఈ చెమ్మకేళీ పర్వం ఎన్నెన్నో వర్ణాల సమాహారం.. ప్రకృతిలోని సమస్త రంగులకు అద్దంపట్టే సంబరం. హోలీ పండుగ నాడు రకరకాల వర్ణాలను వెదజల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం రివాజు. అంతేనా? ఈ పండుగలో ఇంకే ప్రత్యేకతా లేదా?.. అంటే ఎంతో ఉంది. హోలీ పర్వం.. మనిషిలోని వికారాను దహనం చేసుకోమంటుంది. కల్మషాలను కడిగేసుకోవాలని




