ఉత్తరాయణం

సూర్య నమస్కారాలు తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో సూర్య నమస్కారాల గురించి అందించిన కథనం చాలా బాగుంది. మన ప్రాచీనులు ఎంతో ముందుచూపుతో ఆధ్యాత్మిక కోణంలో ఏర్పరిచిన నియమాలు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయో ఈ ఆర్టికల్‍ చదివాక తెలిసింది. సులభందా, సరళంగా ఉండే సూర్య నమస్కార భంగిమలు నేటి తరంలో అందరూ ఆచరించతగినవి. జిమ్‍లకు వెళ్లి గంటల కొద్దీ చేసే కసరత్తుల కంటే సూర్య నమస్కారాలు ఎన్నో రెట్లు మెరుగైనవి. -

తీయతీయని పాయసం

ఏ దైవానికి ఏ నైవేద్యం నివేదించాలనే విషయంలో ఎప్పుడూ సందిగ్ధమే. అయితే భక్తి, శ్రద్ధతో నివేదించే ఏ పదార్థమైనా భగవంతుడికి ఇష్టమే. అయితే ప్రత్యేకించి కొన్ని దైవాలకు కొన్ని నైవేద్యాలను ప్రత్యేకంగా సమర్పించాలి. ఈ క్రమంలో మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ఇష్టమైన నైవేద్యాలమేమిటో, వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా శివుడికి పాలతో తయారుచేసిన పదార్థాలు, తీపి పదార్థాలు అంటే ఇష్టమని అంటారు. కొందరు పెరుగుతో చేసిన పదార్థాలను

ఉసిరికాయకూ ఓ పండుగ!

మన దేశ ఆధ్యాత్మికత ప్రకృతితో మమేకమై ఉంటుంది. అందుకే అనేక పర్వాలు, పండుగలు ప్రకృతిలోని వివిధ పుష్పాలు, ఫలాలు, కాయలతో ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలోని పర్వమే అమలైక్యాదశి. ఆమలికం అంటే ఉసిరికాయ అని అర్థం. ఫాల్గుణ శుద్ధ ఏకాదశినే అమలైక్యాదశి, అమలిక ఏకాదశి అని వ్యవహరిస్తారు. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలోనూ ఉసిరిక వృక్షం విశేషంగా పూజలందుకుంటుంది. ఆ విధంగా ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులు మన

6 సుఖాలు

సుఖంగా ఉండాలని కోరుకోనిదెవరు? అయితే సుఖం అంటే ఏమిటి? మనిషికున్న సుఖాలు ఆరు అని చెప్పిన మహాభారత విధుర నీతి శ్లోకం. శ్లో।। ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః । స్వప్రత్యయా వృత్తిరభీతివాసః షడ్జీవలోకస్య సుఖాని రాజన్‍ । - మహాభారతం ఆరోగ్యం, అప్పులు లేకపోవటం, ఉదర పోషణ నిమిత్తం దూరప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకపోవడం (ఉన్న ఊళ్లో ఉద్యోగం), మంచివాళ్లతో సహవాసం, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవనోపాధి (స్వంత ఉపాధి), భయం

సూర్య రథం.. ఆరోగ్యపథం

మాఘ శుద్ధ సప్తమి ఒకప్పుడు ఉగాది పర్వమై ఉండేదట. ఈ విషయమలా ఉంచితే.. మాఘ శుద్ధ సప్తమి మన ప్రాచీన పర్వాల్లో మాత్రం ఒకటి. ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి

Top