నాలో నేను… నీలో నువ్వు..
ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇప్పటికిప్పుడు ఉన్నవన్నీ త్యజించేసి.. అడవులకో, పర్వత శిఖరాల మీదకో వెళ్లి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడమా? మనకున్నవన్నీ వదిలేసుకుని కట్టుబట్టలతో సంచరించడమా? ఆధ్యాత్మికత అంటే ఒక మతానికో, ఒక దేవుడికో సంబంధించినది కాదు. అదొక మానసిక చింతన. నీలోకి నువ్వు చూసుకోవడం. నీలోని నిన్ను తెలుసుకోవడం. నిన్ను నువ్వు గుర్తించడం. అదొక దైవ చింతన. దీని కోసం సంసారాలను వదిలి పెట్టాల్సిన పని లేదు. ఆస్తిపాస్తుల్ని త్యజించాల్సిన అవసరం లేదు. కాస్తంత వైరాగ్య భావం ఉంటే




