ఉత్తరాయణం

చిన్నారి లోకం అద్భుతం నవంబర్‍ సంచికలో ప్రచురించిన ‘చిన్నారి లోకం’ చాలా బాగుంది. ప్రస్తుతం పిల్లలంటే చదివే యంత్రాలుగానే మారిపోయారు. అయితే, చదువొక్కటే వారికి బతకడం నేర్పదు. విజయ వంతంగా జీవించడానికి అవసరమైన వన రులను, శక్తియుక్తుల్ని, లోకజ్ఞానాన్ని వారికి వారు సముపార్జించుకునేలా తల్లిదండ్రులు, గురువులే వారికి మార్గనిర్దేశం చేయాలని చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎంతగానో చది విస్తుంది.. అలరిస్తుంది. పత్రికను

పిల్లలూ.. వాడే ముందు తెలుసుకోండి

తెలుగులో కొన్ని పద ప్రయోగాలు ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడకూడదో చాలామందికి తెలియదు. కానీ, అటువంటి పదాలు నిత్య వాడుకలో వ్యావహారికంలో ఉంటాయి. నిజానికి మన భాష అవసరానికి కొన్ని సంస్క•త పదాలను వాడుతుంటాం. ఆ పదాలను తెలుగులో సమానస్థాయిలో వాడుతున్నప్పుడు ఆ భాషా (సంస్క •తం) నియమాల్ని మాత్రం ఉల్లంఘిస్తున్నాం. వాడుకలో చలామణిలో ఉన్న కొన్ని పదప్రయోగాల గురించి తెలియ చెప్పే ప్రయత్నమిది. నేటి చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన

కార్తీకమాస విశేషాలు

ఔషధ గుణాలున్నాయి. ఉసిరికాయతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి అనేక విధాల మేలు కలుగుతుంది. ఉసిరిక శీతగుణం కలది. తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. కార్తీక సోమవారం: కార్తీక సోమవారం శివుడికి అత్యంత

కార్తీక దీపం

నవంబరు 1, గురువారం, ఆశ్వయుజ బహుళ అష్టమి నుంచి-నవంబరు 30, శుక్రవారం కార్తీక బహుళ అష్టమి వరకు విలంబి నామ సంవత్సరం-ఆశ్వయుజం-కార్తీకం-శరదృతువు-దక్షిణాయన ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం నవంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ - కార్తీక మాసాల కలయిక. ఆశ్వయుజ మాసంలోని కొన్ని రోజులు, కార్తీక మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ఆశ్వయుజంలో వచ్చే పర్వాలలో ధన త్రయోదశి, నరక చతుర్దరశి, దీపావళి ముఖ్యమైనవి. దీపావళి నాడే

పిల్లలు ఏం తింటున్నారు?

ఈ కాలం పిల్లలకు అన్నం అంటే రుచించడం లేదు. స్పైసీ, జంక్‍ ఫుడ్‍ అంటే మాత్రం ‘నాలుక కోసుకుంటున్నారు’. తల్లిదండ్రులు కూడా మునుపటి మాదిరిగా ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించే విషయంలో మిన్నకుండిపోతున్నారు. బలవంతంగా తినిపించడం వల్ల మేలు కన్నా చేటే ఎక్కువ చేస్తుందని భావిస్తున్నారు. దీంతో పిల్లలు ఏం తింటున్నారో?, ఏం జీర్ణం చేసుకుంటున్నారో? ఎలా పెరుగుతున్నారో అనే పట్టింపే ఎవరికీ లేకుండా పోతోంది. దీని ఫలితంగానే చిన్న

Top