పిల్లలు – పక్షులు

ఒకప్పుడు పిల్లులపై పక్షులదే పై చేయిగా ఉండేది. పిల్లులు చాలా కష్టపడి, రాత్రి అయ్యే సరికి పక్షులకి కావలసిన వాటిని సేకరించి యిచ్చేవి. పక్షుల రాజు ఆ ఆహారాన్నంతటినీ తీసుకుని తనకి కొంత ఉంచుకుని, పక్షులకి యిచ్చేవాడు. పక్షులకి చీమల్ని తినడం యిష్టం. అందువల్ల ప్రతి పిల్లి మెడలోను ఒక సంచి వేలాడుతూ ఉండేది. దానిలో ఆ పిల్లి చీమల్ని సేకరించి పక్షిరాజుకి యిచ్చేది. పిల్లులకి తమకి జరుగుతున్న అన్యాయం చాలా బాధ

ఐదుగురు తింగరోళ్ళు

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పధంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘సామెత కథ’ల పరిచయం. ‘‘రాజు నీతి

మత్స్యయంత్రం… మన్మధ తంత్రం

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. ఆయా పాత్రల పేర్లు, వాటి ఔచిత్యం, వాటి లక్షణం క్లుప్తంగా తెలియ చెప్పే ప్రయ• మత్స్య యంత్రం ద్రౌపదీ స్వయంవరంలో పైన ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద ఉన్న నీటిలో ఆ యంత్ర ప్రతిబింబాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని

కాశీమజిలీ కథలు బలభద్రుడు

మగధ దేశాన్ని మంత్రపాల మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ దేశానికి రాజధాని అమరావతి. రాజు భార్య పేరు చంద్రమతి. వారికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు హైమావతి అని పేరు పెట్టారు. హైమావతి యుక్తవయస్సు రావడంతో ఆమెకు పెండ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. దాంతో వివిధ దేశాల రాకుమారుల చిత్రపటాలను తెప్పించారు. వాటిలో కళింగదేశపు రాజు వీరపాలుని పుత్రుడు గుణవర్మ లాటదేశపు ప్రభువు శూరపాలుని పుత్రుడు ధనవర్మ చిత్రపటాలు

నీలోనే ఆనందం

జీవిత సత్యం తెలుసుకోవడమే ఆనందానికి మూలం. కొండ అడ్డు వచ్చిందని నది తన ప్రవాహాన్ని అక్కడితో ఆపేయదు. నది తన పక్క మార్గం వెతుక్కుని మరీ ముందుకు సాగిపోతుంది. ఉలితో చెక్కితేనే కఠిన శిలలైనా సుందర శిల్పాలుగా మారేది. వెదురు కర్ర అయినా, దాన్ని మురళిగా మారిస్తే ఆనందరవళిని వినిపిస్తుంది. ఆ మధుర గానం ఏకంగా శ్రీకృష్ణ పరమాత్ముడినే పరవశింప చేస్తుంది. ఆ మధుర గానం లోకాలను ఓలలాడిస్తుంది. కష్టాలకు

Top