మనవడొచ్చాడు!

ఇది చదివి సినిమా టైటిల్‍ అనుకోకండి. మంచు మోహన్‍బాబు కుటుంబంలో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు ఇటీవలే కొడుకు పుట్టాడు. కొత్త ఏడాది ప్రారంభంలో ఇంట్లోకి ఓ కొత్త సభ్యుడు రావడంతో మంచు కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. విష్ణు, వెరోనికా దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) సంతానం. మూడో సంతానంగా అబ్బాయి పుట్టాడు. ‘అవ్రామ్‍ భక్త’ అనే పేరు పెట్టారు. ‘అవ్రామ్‍’ అంటే ఎవరూ ఆపలేని వాడు

ఏప్రిల్‍ 27.. విడుదల

ఏటా సంక్రాంతికి అగ్రహీరోల భారీ బడ్జెట్‍ సినిమాలు విడుదలవుతుండటం, అతి పెద్ద పోటీ నెలకొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పవన్‍కల్యాణ్‍ ‘అజ్ఞాతవాసి’; బాలకృష్ణ ‘జైసింహా’ విడుదల కానున్నాయి. అయితే దీనికి మించి ఏప్రిల్‍ 27వ తేదీ చిత్ర పరిశ్రమను ఇంకా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఈ తేదీనే అల్లు అర్జున్‍ నటించిన ‘నా పేరు సూర్య’ విడుదల కానుంది. అదే తేదీన మహేష్‍బాబు ‘భరత్‍ అనే నేను’ వస్తోంది. ఇక, రజనీకాంత్‍

బహు నాయకా.. భళా

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సంప్రదాయం నెలకొంది. మల్టీస్టారర్‍ (బహు నాయక) చిత్రాలకు మళ్లీ క్రేజ్‍ ఏర్పడుతోంది. ఈ వరుసలో మొదట నిలిచే చిత్రం కాబోతోంది- ఎన్టీఆర్‍, రామ్‍చరణ్‍ హీరోలుగా రా•మౌళి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఈ ఇద్దరు అగ్ర కథానాయకులతో నడిచే ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ స్థాయిలో తీర్చిదిద్దుతాడో కానీ, అది సంచలనమే కానుంది. ఇక, యువ హీరోలు నితిన్‍, శర్వానంద్‍ కలిసి ‘దాగుడుమూతలు’ ఆడబోతున్నారు. దీనికి

సాయిధరమ్‍ ‘ఇంటెలిజెంట్‍’

వినాయక్‍ దర్శకత్వంలో సాయిధరమ్‍ తేజ హీరోగా ‘ఇంటెలిజెంట్‍’ సినిమా రాబోతోంది. ఫిబ్రవరి 9న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవికి ‘ఖైదీ’ ఎలా టర్నింగ్‍ పాయింటో, సాయిధరమ్‍కు ‘ఇంటెలిజెంట్‍’ అలా నిలుస్తుందని నిర్మాత కల్యాణ్‍ అంటున్నారు. ఇందులో ‘చమకు చమకుచాం.. చుట్టుకో చుట్టుకో’ (చిరంజీవి ‘కొండవీటిదొంగ’లోని గీతం) అనే పాటను రీమిక్స్ చేశారు.

ప్రభాస్‍ డైరెక్షన్‍.. రాణా నిర్మాత.. అఖిల్‍ హీరో

ఈ క్రేజీ కాంబినేషన్‍లో ఓ సినిమా రాబోతోంది. ప్రభాస్‍ అంటే ‘బాహుబలి’ హీరో ప్రభాస్‍ కాదు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్యప్రభాస్‍. ఈయన తమిళంలో ‘యాగవరాయినుమ్‍ నా కాక్క’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. తెలుగులో ‘మలుపు’ అనే టైటిల్‍తో ఈ సినిమా విడుదలైంది. ఇందులో హీరో సత్యప్రభాస్‍ సోదరుడు ఆది పినిశెట్టి. ‘మలుపు’ తరువాత సత్యప్రభాస్‍ తన నెక్టస్ ప్రాజెక్టును అఖిల్‍తో చేసేందుకు స్క్రిప్ట్ రెడీ

Top