వేటగాడూ
ఉజ్జయినీ నగర సమీపంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దానిపై ఒక కాకి, ఒక హంస కాపురం ఉంటున్నాయి. దుష్ట స్వభావం, అల్పబుద్ధి గల కాకి సంగతి తెలిసి కూడా హంస పొరుగున ఉంటున్నదని దానితో స్నేహంగానే మసలుతోంది. ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేట యేమీ దొరకక తిరిగి యింటికి పోతూ ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అది వేసవికాలం ఎక్కడా గాలి లేదు. అతనికి శరీరం అంతా




