పెరిగే పిల్లల సమగ్ర అభివృద్ధి, సర్వతోముఖ వికాసానికి తోడ్పడేందుకు సన్‍షైన్ పిడియాట్రిక్స్ ఎంతగానో దోహదపడుతోంది. జార్జియాలోని కమ్మింగ్‍లో అందరికీ అందుబాటులో ఉన్న ఈ వైద్యశాలలో అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి యువతీయువకుల వరకు అందరికీ వైద్య సదుపాయాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.
అంతేకాదు ఎదుగుతున్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలతో పాటు నిర్ణీత సమయంలో వారి అభివృద్ధి కొరకు ‘‘వెల్‍బేబి చెకప్స్’’ మరియు ఆన్యువల్ చెకప్‍లు కూడా చేస్తోంది.
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం, వారి ప్రభావము, పుట్టకముందు నుంచే ఉంటుంది. కనుక ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధతో డాక్టర్ ఆనందీ చుండూరి.., గర్భిణీ స్త్రీలకు ప్రెంటల్ కన్సల్టేషన్ ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విధంగా బిడ్డ పుట్టక ముందే వారి పేరెంట్స్కి ఆరోగ్య సమస్యలపై ఒక అవగాహన తీసుకువచ్చి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. దీనివల్ల గర్భిణీలలో ఆందోళన తగ్గి ప్రసవం సులువుగా జరుగుతుందని, తల్లిబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ ఆనందీ చుండూరి చెప్పారు. అంతేకాదు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.., పిల్లల మనోవికాసం, విద్యాభ్యాసం కూడా అంతే ముఖ్యమెనవని ఆయా అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని విశ్లేషించి సమస్యను నిర్ధారించి సన్‍షైన్ పిడియాట్రిక్స్లో చికిత్స నందిస్తున్నారు.
పిల్లల ఉజ్వల భవిష్యత్తు సన్‍షైన్ పిడియాట్రిక్స్ యొక్క ముఖ్య లక్ష్యమని డాక్టర్ ఆనందీ చుండూరి చెప్పారు. రోగ నిర్ధారణ, చికిత్సతో పాటు వ్యాధి నివారణ, ఆరోగ్య సంరక్షణ తమ హాస్పిటల్ ప్రత్యేకతలని వివరించారు. అంతేకాదు తమ వద్దకు వచ్చే పేషెంట్స్ యొక్క మెడికల్ రికార్డస్, ఆన్‍లైన్ పేషెంట్ పోర్టల్‍లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. మరి డాక్టర్ ఆనందీ చుండూరి అపాయ్‍మెంట్ కావాలనుకునే వారు ఈ క్రింది చిరునామాను సంప్రదించండి. మీ పిల్లల ఆరోగ్య పరిరక్షణకై డాక్టర్ ఆనందీ చుండూరి 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు.
Review సన్ షైన్ పీడియాట్రిక్స్.