ఇక విడుదలే తరువాయి!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే హైదరాబాద్‍లో చిరంజీవి, బాలీవుడ్ తార మౌనీరాయ్‍పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనీరాయ్‍తో పాటు వంద మంది డ్యాన్సర్లతో ఈ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. దీంతో సినిమా పూర్తయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవి సరసన త్రిష,




