మధుమధురే మధుకైటభభంజనీ
రాక్షస సంహారం చేసిన జగన్మాత చివరి రోజున రణన్నినాదం చేసింది. సర్వ దుర్లక్షణాలకు ప్రతీకైన మహిషాసురుడిని మట్టుబెట్టింది. ఆ సమయంలోనే విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని ఆదిశంకరులు దర్శించి అమితానందాన్ని పొందారు. ‘అయిగిరినందిని, నందిత మేదిని’ అంటూ పులకించిపోయారు. ‘అయిజగదంబ కదంబ వనప్రియా’ అంటూ కీర్తించారు. ‘మధుమధురే మధుకైటభభంజనీ’ అంటూ ప్రార్థించారు. అదే 21 శ్లోకాల మహిషాసుర మర్దిని స్తోత్రంగా అవతరించింది. ఇందులోని ప్రతి అక్షరం మంత్రమే.. ప్రతి పదం, ప్రతి పాదం




