ఉత్తరాయణం

రావమ్మా మహాలక్ష్మి.. వరలక్ష్మీ వ్రత నేపథ్యంలో అందుబాటులో ఉన్న లక్ష్మీ సాధనాల గురించి అందించిన ‘రావమ్మా మహాలక్ష్మి మా ఇంటికి’ కథనం బాగుంది. పూజగదిని వరలక్ష్మీ వ్రత వేళ అందంగా ఎలా అలంకరించుకోవాలో, పూజాలంకరణ వస్తువులు ఏవేమి అందుబాటులో ఉన్నాయో బాగా వివరించారు. - ఆర్‍.సారధి, పి.వరప్రసాద్‍- విశాఖపట్నం, కేఆర్‍కే చలపతిరావు- హైదరాబాద్‍, కనిగిరి వెంకట్రావు, కె.సీత మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు వ్రత విధి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆగస్టు తెలుగు

కనులపండువ.. శరత్కాలపు వెన్నెల

చందనం శీతలం ఆరోగ్యదం లోకే చందనాదపి ఫలవాన్‍ చంద్రికా చంద్ర చందనయోరపి శీతలా ఆరోగ్యదా సౌందర్య సంపత్కరీ సుఖదా చ శరత్చంద్రికా లోకంలో చల్లనిదీ, ఆరోగ్యాన్ని ఇచ్చేదీ చందనం. దాని కంటే శక్తి గలది పున్నమి వెన్నెల. అంతకంటే సౌఖ్యాన్ని, సౌందర్యాన్ని, సంపదలనూ ఇచ్చేది శరత్కాల వెన్నెల. ఇదీ పై శ్లోకం భావం. ఎందరో కవులు శరత్కాల వర్ణనలకు పెద్దపీట వేశారు. నన్నయ్య ‘శారద రాత్రులుజ్జ్వల..’ అంటూ శరత్కాల వర్ణనతో రచన చాలించాడు. ఎరాప్రగడ శరత్కాల వర్ణనతో భారతాన్ని కొనసాగించాడు. విశేషమేమిటంటే- నన్నయ్య రాత్రిని

దిలీప్‍ టుంకి… టూ లీడర్‍

నాయకుడు- అందరిలా సాధారణంగానే పుడతాడు. కానీ, అతడి అసాధారణ ఆలోచనలు, చర్యలే.. అతడిని నాయకత్వం వహించే వాడిగా తీర్చిదిద్దుతాయి. మార్పు- రాత్రికి రాత్రే రాదు. కానీ, మొగ్గ తొడిగి, మారాకు వేసి ఆకుగా రూపాంతరం చెందినట్టు ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణంలో మార్పు మొదలవుతుంది. ఆ ఆరంభమే కొత్త మార్పునకు నాంది పలుకుతుంది. గొప్ప నాయకత్వ పటిమ ఉన్న వారే గొప్ప మార్పునకు పునాది వేయగలుగుతారు. నాయకుడంటే ముందుండి నడిపించే వాడు కాదు..

ఉత్తరాయణం

102 నాటౌట్‍ ఆనందాన్నిచ్చే పనిచేయాలి.. తృప్తి కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి.. శరీరానికి సౌఖ్యాన్నిచ్చే వ్యాయామాన్ని చేయాలి.. జీవితంలో ఈ మూడు పనులు చేస్తే చాలు వందేళ్లు బిందాస్‍గా బతికేయొచ్చనే కాన్సెప్ట్తో ఏప్రిల్‍ 2025 తెలుగుపత్రికలో అందించిన ఆరోగ్యభాగ్యం శీర్షిక చాలా బాగుంది. ఈ మూడు అంశాలను చక్కగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వివరించిన తీరు బాగుంది. - పి.చిన్నికృష్ణ- విశాఖపట్నం, ఆర్‍.శివప్రసాద్‍, కె.కవిత, సి.శశిధర్‍రావు, వక్కంతం బలరామ్‍, రాజారవిప్రకాశ్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు రామ

జమీందారు- శెట్టి గారి అప్పు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక బేగంనగరపు జమీందారు ఒక అలీనవాజను మహమ్మదీయుడు పేదసాదలకు, దిక్కులేని వా రందరి కాతడు కడు ఆత్మీయుడు పోషిస్తాడు దీనులందరిని కంటిరెప్పలా, బిడ్డల మాదిరి అందువల్లనే జనులందరికీ అతడంటే బహు అభిమానం మరి ఆ ఊళ్లోనే రామిశెట్టి అని ఉన్నాడొక్క డబ్బుగల కోమటి అప్పుకోసమెప్పుడూ కాచుకొని ఉంటారెందరెందరో వాకిట చుట్టుపట్ల పల్లెలవారందరు పేదలె

Top