ఉగాది పచ్చడి ‘ఔషధీ’
వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా ఉగాది నాడు ఒక విధమైన పచ్చడి చేస్తారు. దీనికి ఉగాది పచ్చడి అని పేరు. ఇది ఔషధ యోగం. కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు మొదలైనవి లేకుండా తీసివేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. ఆ గుజ్జులో కావాల్సినంత కొత్త బెల్లం వేయాలి. అందులో వేపపూవుల కాడలు, పుల్లలు లేకుండా బాగు చేసి వేయాలి. అలా తయారు చేసి గుజ్జులో




