ఆహా బాహుబలీ

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడిక ఇది అంతగా ఆసక్తి కలిగించే ప్రశ్న, సందేహం కానేకాదు. ఇప్పుడంతా అసలు ‘రాజమౌళి బాహుబలి’ని ఎలా తెరకెక్కించాడు? అందుకోసం ఏం కలగన్నాడు? తన కలను వెండితెరపై ఎలా ఆవిష్కరించుకొన్నాడు?’ అనేవే అందరికీ ఉత్కంఠ కలిగిస్తున్న ప్రశ్నలు. వాటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ విశేషాలు చదవాల్సిందే. వెండితెర విజువల్‍ వండర్‍ ‘బాహుబలి’ ఇప్పుడొక చరిత్ర. ఇప్పుడంతా ‘బాహుబలి’.. ఆ చిత్ర విశేషాలు..

జగమంతా సచ్చిదానందం

లోకంలోని ఆనందమంతా ఆయన ముఖంలో సచ్చిదానందమై ప్రకాశిస్తుంది. చూసినంతనే ఆయన చిన్ముద్ర రూపం చెరగని ముద్ర వేస్తుంది. కుంకుమ చందన లేపితమై నొసటన వెలుగొందే ఆ బొట్టు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక.. కాషాయ వర్ణ వస్త్రాలు త్యాగనిరతిని, నిస్వార్థ చింతనను నేర్పే దివ్యాభరణాలు.. ముచ్చటగొలిపే మూడు మూర్తుల (త్రిమూర్తుల) స్వరూపాన్ని ఏకముఖమై అవతరించిన సద్గురు సచ్చిదానంద స్వరూపం.. గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తుడు (దత్తాత్రేయుడు)లోని గురు పరంపరను, గుహుడు (కుమారస్వామి)లోని

మన కీర్తి పతాక మన తెలుగు పత్రిక

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. అన్నారు మన పెద్దలు. మన ‘తెలుగు’కు మనమే వెలుగుబాట కావాలి. మన సంస్క•తీ సంప్రదాయాలకు మనమే ప్రతీకగా నిలవాలి. మన ‘భాష’ను మనమే కాపాడుకోవాలి. మన ‘యాస’ను మనమే నిలుపుకోవాలి. ఈ ప్రయత్నంలో తెలుగు జిలుగు లను నేల నలుచెరగులా విరజిమ్మాలనే తలంపుతో అక్షర శ్రీకారం చుట్టుకొంది- ‘తెలుగు పత్రిక’ ఇది మన పత్రిక.. మన అచ్చ తెనుగు పత్రిక. ఈ అక్షర మహా యజ్ఞంలో విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా భాగస్వాములు కావాలి. అందుకే.. మీ మీ

జాతి ఆ’మో’దించిన నేత

ఏదో కావాలి, ఇంకేదో సాధించాలి, అంతటా తానై నిలవాలనే సంకల్పం, దీక్ష, పట్టుదల ఒక మనిషిని అందనంత ఎత్తులో నిలబెడతాయి. అలాంటి నిరంతర దీక్షాశీలి, నిరంతర అన్వేషి, ఎవరికీ తలొగ్గని నిజమైన రాజకీయవేత్త, తాననుకున్నది సాధించి తీరాలన్న పట్టుదల... ఇవన్నీ కలగలిస్తే.. నరేంద్ర దామోదరదాసు మోదీ!. ఒక అడుగుకు ఇంకో అడుగు తోడయితేనే విజయపథ సోపానాలధిరోహించగలరు. అలా ఒక్కొక్క అడుగును మిళితం చేస్తూ అట్టడుగు ప్రచారక్‍ స్థాయి నుంచి దేశ

అచ్చ తెలుగు ముద్ర కూచిపూడి

అద్భుత ఆహార్యం, విశిష్ట వాచికాభినయం కూచిపూడి సొంతం. కృష్ణా తీరంలో ప్రభవించి, అచ్చ తెలుగు సంప్రదాయంలో వికసించి, ఖండఖండాంతరాల్లో జయకేతనం ఎగురవేసిన ఘనచరిత్ర కూచిపూడి నృత్యానిది. ఆనాటి సిద్ధేంద్రుడి నుంచి నిన్నటి వెంపటి చిన సత్యం వరకు ఎందరో మహానుభావుల కేళికా విన్యాసాలతో పరిపుష్టమై భారతీయ శాస్త్రీయ నృత్యాలకే తలమానికమై దేశవిదేశాల్లో అసంఖ్యాక అభిమానుల ఆదరణ అందుకుంటున్న అచ్చ తెలుగు కళా రూపమిది. తెలుగు.. కూచిపూడి.. ఈ రెండింటిదీ

Top