సంబరాల సంక్రాంతి పులకించెను ప్రకృతి
సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా సంబరమే. ఎందుకంటే పక్రృతిని పోషించే శక్తి కలిగిన పౌష్య లక్ష్మి సృష్టిలోని సమస్తాన్నీ సిరులొలికించే చిరునవ్వుతో పలకరించే పర్వదిన సందర్భమే సంక్రాంతి. సంక్రాంతి ఒంటరిగా రాదని మన పెద్దలు అంటారు. అందుకే కాబోలు మహారాణిలా ముందు భోగి పండుగను.. వెనుక పరివారంలా కనుమ పండుగను వెంటేసుకుని.. చెలికత్తెల నడుమ రాకుమారిలా నడిచి వస్తుంది సంక్రాంతి. ఈ ప్రకృతి పండుగ నాడు పగలు




