జ్యోతిర్లింగ వెలుగుల్లో మనసు కడిగిన ముత్యం కావాలి
ఒక యువకుడు కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరాడు. తొలి రోజు డ్యూటీకి ఉత్సాహంగా హాజరయ్యాడు. యువకుడు.. ఉడుకులెత్తే రక్తం.. తన విధి నిర్వహణలో సమాజాన్ని మార్చేయాలన్నది అతని ఉద్దేశం. సీనియర్ పోలీసు అధికారితో కలిసి ఆ యువ పోలీసు అధికారి ఓ ప్రధాన రోడ్డు మీదుగా వాహనంలో వెళ్తున్నాడు. అంతలో వారి వాహనంలోని వైర్లెస్ సెట్‌కు ఒక సందేశం వచ్చింది. ‘ఫలానా రహదారిపై జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. అక్కడేం జరుగుతోందో తెలుసుకోండి’