సంపాదకీయం కొత్త క్రాంతి
కాల చక్రానికి అధిపతి సూర్యుడు. కర్మసాక్షి అయిన ఆయన ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి రెండు ఆయనాలు వస్తాయి. అవి- దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలి పదిహేను రోజుల చివర్లో అంటే, సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అనీ అంటారు. ఈ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అందుకే సంక్రాంతి వేళ సూర్యారాధన చేస్తూనే ఆహారాన్ని ప్రసాదించే నేలతల్లినీ అందమైన రంగవల్లులతో, పూజలతో పూజిస్తారు. భోగితో మొదలై ముక్కనుమతో ముగిసే