చిత్రం.. భళారే చైత్రం
ఈ సృష్టి ఎంత ‘చైత్ర’మైనదో కదా? అటు సంవత్సరారంభ దినం ఉగాది.. ఇటు జగదానందకారమైన సీతారాముల కల్యాణం.. ఒకటి ఆనందోత్సాహాల పర్వం.. ఇంకొకటి ఆధ్యాత్మిక పరవశ ఘట్టం.. మనం మంచి పనులు చేసేటపుడు, శుభకార్యాలు తలపెట్టినపుడు చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా, శుభకరంగా ఉండేలా చూసుకుంటాం. కానీ, ఇటువంటి ఏర్పాటును ఉగాదికి ప్రకృతే కల్పిస్తుంది. కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా ప్రకృతి కొత్త రూపు సంతరించుకుంటుంది. వసంత గాలులు.. కోయిలల మధుర గానాలు.. మావిచిగుళ్ల మిళమిళలు.. వేపపూల కళకళలు.. ఎటుచూసినా కొత్త