అమ్మ.. చల్లని పూలకొమ్మ

అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం? ఎంతటి దౌర్భాగ్యం?.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ ఉన్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది. రెండు సంవత్సరాల క్రితం అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారట. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంత తెలుసా?

భలే మంచి రోజు..

అన్ని రోజులూ మంచివే. రోజులు, సంవత్సరాలు మంచివి, చెడ్డవి అనే వ్యత్యాసంతో ఉండవు. ‘వచ్చే సంవత్సరం కలిసొస్తుంది..’, ‘రేపు మంచి జరుగుతుంది...’ ఇటువంటి భావనలన్నీ ఆశతో బతకడానికి పనికొస్తాయి కానీ, ఆశయంతో జీవించాలంటే మాత్రం ఆశకు తోడు విశ్వాసం కావాలి. మనం జీవించే ప్రతి క్షణం మంచిది కావాలంటే, మంచిగా మలుచుకోవాలంటే.. ముందు మన మనసు శుద్ధి కావాలి. మన మనసులోని భావాలు, భావనలు మంచివై ఉండాలి. అప్పుడు

ఏది నీ దారి?

పతీది మన ప్రారబ్ధం అనుకోవడం బలహీనుల లక్షణం. మన పుట్టుక,. దేహవర్ణం, తల్లిదండ్రులు, బంధువర్గం తదితర విషయాల్లో మనం స్వతంత్రులం కాకపోవచ్చు. భగవంతుడు ఎక్కడ పుట్టిస్తే, అక్కడి నుంచే మన జీవితాన్ని ఆరంభించాలి. కానీ స్వప్రయత్నంతో మనం ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. మన చరిత్రను మనమే తిరిగి రాసుకోవచ్చు. మన జన్మ ప్రారబ్ధ కర్మ కావచ్చు. కానీ, భవిష్యత్తు మాత్రం మన పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసే

నీకు నువ్వే దీపం

ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది. ఇంకొకతని వద్ద లేదు. కానీ ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడవడం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు. కారణం- దీపమున్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అని

ఆధ్యాత్మిక జీవన

పరమార్థం ఎలా బోధపడుతుంది? ఒక్కోసారి అనుభవమే దానిని బోధిస్తుంది. కొన్నిసార్లు లోతుగా తత్త్వ విచారణ సాగించడానికి గురువులే బోధించాల్సి ఉంటుంది. ఇంకొన్నిసార్లు చాలా సాధారణ వ్యక్తులే మనకు స్ఫూర్తిగా నిలిచి పరమార్థం బోధిస్తారు. మనల్ని చుట్టుముట్టే ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలెన్నెన్నో. వాటి వెనుక ఉన్న పరమార్థం తెలుసుకుంటేనే జీవనం అర్థవంతమవుతుంది. లేదంటే వ్యర్థంగా మిగులుతుంది. ఇనుము కాలినప్పుడే వంగుతుంది. ఏ రకమైన ఆకృతి కావాలంటే అలా మారుతుంది. మనిషి కూడా సంసారమనే

Top