చక్కని బుద్ధి.. లక్ష్మీసిద్ధి!

సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతోనే కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తారు. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వ్రతం కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జగన్మాత పార్వతి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా? అని

ఓం గురుభ్యోనమ:

గురువు అంటే..గౌరవమైనది, గొప్పది అని అర్థం. గురువు అనే శబ్దం మనలోని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. మనలో ఏళ్ల తరబడి పిడచకట్టుకొనిపోయిన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే మహత్తర శక్తి గురువు. భారతదేశం యుగయుగాలుగా గురువును గొప్ప దృష్టితో చూస్తోంది. ధర్మదండాన్ని గురువు చేతికిచ్చి దేశ ధర్మాన్ని నడిపించాలని కోరిన ఘటన భారతీయులది. గురువులు కూడా పలు రకాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆవపోసన పట్టిన గురువులు కొందరు.. రాజనీతి సామాజిక బాధ్యతను తమ

ప్రేమ జీవన వేదం..

ప్రపంచం చిన్నదైపోయే కొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెద్దవైపోతున్నాయి. ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. కానీ, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం ఇరుకై•పోతున్నాయి. వస్తువుల్ని ప్రేమించి.. మనుషులను ద్వేషించుకునే ధోరణి ప్రబలిపోతోంది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని అప్పుడప్పుడు ‘వాడుకుని’ వదిలేస్తున్నాం. ఈ రోజుల్లో మనం వాడే నిత్యావసరాలు, పరికరాలు, ఉపకరణాలు ఎంతో ‘స్మార్ట్’.. కానీ, వాటిని వాడే, వినియోగించే మనం మాత్రం చాలా ‘హార్డ్’గా మారిపోతున్నాం. అందరిదీ అదే తీరు. ఇదే లోకం రీతిగా మారిపోయింది. అసూయ, ద్వేషం అనేవి అనివార్య

మాటామంతీ..

మాట పొందికగా ఉండాలి. మనం వాడే భాష అందంగా ఉండాలి. అప్పుడే మనకు, మనం మాట్లాడే మాటలకు మర్యాద, మన్నన. మాట మన్నన తేవాలి. మన్నన లేని మాట మాటే కాదు. మన సంభాషణలో మర్యాద - మన్నన అనేవి ఉండటం చాలా అవసరం. సంభాషణలో అప్రియత్వానికి, నిష్కప•త్వానికి భేదం తెలియని వారున్నారు. అప్రియం మర్యాదకు భిన్నమైనది. అది మనకు మన్నన తీసుకురాదు. కొందరు తామనుకున్నదే చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అప్రియమైన పదాలు వాడతారు. నిజానికి ఎవరైనా తామెలా భావిస్తున్నారో అలా

నవ్విస్తూ.. ఆలోచింపచేస్తూ..

మన తెలుగు వారంతా గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు- శ్రీకృష్ణదేవరాయలు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడమే కాదు.. మన మాతృభాష తెలుగును దశదిశలా వ్యాపింప చేశారు. భాషా ఉన్నతికి పాటుపడ్డారు. రాయల వారు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయనకు సాహితీ అభిలాష మెండు. ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ అనేది ఆయనకు గల అనేక బిరుదుల్లో ఒకటి. అందుకు తగినట్టే ఆయన ‘భువన విజయం’ అనే సభను నిత్యం నిర్వహిస్తుండే వారు. ఇందులో అష్టదిగ్గజాలు

Top