విశ్వమంతా ఈశ్వర రూపమే!

అమావాస్య ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి శివుడికి మహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తారు. ఆ రోజు శివుడిని భక్తితో కొలుస్తారు. ఇక, ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘ మాసంలో వచ్చే శివరాత్రి మహిమాన్వితమైనది. కాబట్టి దీనిని మహా శివరాత్రి అంటారు. దీనిని పెద్ద పండుగలా జరుపుకుంటారు. సాధారణంగా పండుగలంటే ప్రతి ఇంటా పిండివంటలు ఘుమఘుమలాడుతాయి. కానీ, మహా శివరాత్రి మానసిక పర్వం.

గురువే సర్వస్వం

గురుసేవ ఎలా చేయాలి? సేవ అనేది చాలా పవిత్రమైనది. ఇష్టముంటే చేయడం లేదా మానటం సేవ అనిపించుకోదు. ‘ఈ శరీరం గురువుది. నా తనువు, మనసు, బుద్ధి గురువు ఆధీనంలోనే ఉన్నాయి. నేను స్వతంత్రుడను కాను’ అనే భావంతో గురుసేవ చేసే వారు ధన్యులు. గురుశిష్య సంబంధాలకు అద్దంపట్టే ఉదాహరణలు మన పురాణేతిహాసాల నిండా అనేకం ఉన్నాయి. హితాహితాలు ఎరిగిన వాడు గురువు. గురువు ఏది చెప్పాడో అదే హితాన్ని కలిగిస్తుంది. గురువు పట్ల

విజయ సంకేతం

యస్యా: పరతం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా: ఈ సృష్టిలో దుర్గాదేవిని మించిన శక్తి మరేదీ లేదని పై శ్లోకానికి భావం. అందుకు కాబట్టే ఆ శక్తిని ‘దుర్గ’ అన్నారు. విశ్వధాత్రి.. ఈ సృష్టి శక్తి దుర్గాదేవి. శక్త్యారాధన అంటే మాతృదేవి ఆరాధనమే. ఈ సృష్టికి మూలం ఆది పరాశక్తే. సృష్టి, స్థితి, లయాలన్నీ ఆ దేవి ఆధీనాలు. శివుడైనా సరే పక్కన శక్తి (అమ్మ వారు) ఉంటేనే ఈ సృష్టిని

యోగభాగ్యాలు

ఈ కాలంలో భోగభాగ్యాలు ఉండటం గొప్ప కాదు. ఆరోగ్యంగా ఉండటమే మహా భాగ్యం. అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు ఆరోగ్యమే మహా భాగ్యమని.. భావితరాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నెన్నో నియమాలు, పద్ధతులు ఏర్పరిచారు. అటువంటి వాటిలో ఉత్తమోత్తమైనది- యోగా. అందుకే ఇది యోగభాగ్యాల కాలం. పతంజలి మహర్షి ఈ లోకానికి ఒక అపురూపమైన కానుకగా అందించిన అద్భుతమైన ఆరోగ్య మంత్రమిది. యోగాను ఆచరించి, సాధికారికంగా బోధించింది ఆయనే. పతంజలి మహర్షి ఉద్బోధించిన అష్టాంగ యోగం ఒక రాజమార్గం.

‘బార్బర్‍ షాపుకి ఎలా వెళ్లాలండీ?’ ‘బాగా జుత్తు పెంచుకుని వెళ్లాలండీ..’

వెనకటికి ఒకాయన దారి అడిగితే అవతలి వ్యక్తి ఇచ్చిన సమాధానమిది. కొందరు మాట్లాడితే హాస్యం, చమత్కారం కలగలిసి ‘జోకు’లు విరబూస్తాయి. మనసారా నవ్వుకోవడం ఒక యోగం నవ్వలేకపోవడం.. జీవితంలో నవ్వే లేకపోవడంతో నిజంగా ఒక రోగమే.. అందుకే బాధలు, బరువులు కాసేపు పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. కష్టాలు, కన్నీళ్లకు టానిక్‍ నవ్వే. నవ్వు ఒకింతయూ లేని రోజు రోజే కాదు. కాబట్టి.. నవ్వులు రువ్వండి. మే 2, వరల్డ్ లాఫర్‍ డే సందర్భంగా అందరికీ చిరునవ్వుల శుభాకాంక్షలు

Top