మాతృత్వం ఓ తీయని కల
మూఢనమ్మకాలు మనిషి జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇవి తల్లి నుంచి పిల్లలకు, ఒక తరం నుంచి మరొక తరానికి క్రమం తప్పకుండా వస్తూనే వున్నాయి. ఈ మూఢనమ్మకాలను పామరులు, గ్రామీణ ప్రజలే కాకుండా విద్యా వంతులు, పట్టణ ప్రాంతాలవారు కూడా పాటిస్తున్నారు. ఆ మూఢనమ్మకాల మూలంగా మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. మహిళలు గర్భధారణ సమయంలో తెలిసీ తెలియని వారి మాటలు విని వాటిని ఆచరిస్తుంటారు.




