చర్మానికి వరం చందనం

చర్మానికి నిగారింపు రావాలన్నా లేదా ముఖాన్ని మచ్చలు, గీతలు, మొటిమల నుంచి విముక్తి చేయాలన్నా చందనానికి సాటి మరోటి లేదు. కేవలం సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చందనం అమూల్యమైనది.
చందనం లేదా గంధం ఒక విలువైన చెక్క. భారతదేశంలో దాన్ని అధికంగా వాడు తుంటారు. ఇది చాలా ఖరీదుగా ఉండటానికి కారణం ఈ చెట్లు నిదానంగా పెరగటమే. ఒక చెట్టు పూర్తిస్థాయిలో ఎదిగేందుకు సంవత్సరాలు పడుతుంది.

చందనం సౌంర్యానికే కాక ఆరోగ్యానికీ సాటిలేని ప్రయోజనకారి. రండి, చందనం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఎండకు నల్లబడిన చర్మాన్ని మళ్లీ కాంతివంతం చేసేందుకు ‘కొబ్బరినీళ్లు’, ‘పచ్చిపాలు’, ‘కీరారసం’, ‘నిమ్మరసం’, ‘శనగపిండి’, కాస్తంత
‘చందనం పొడి’ కలిపి పేస్టులా చేయండి. దీన్ని స్నానానికి గంట ముందు చర్మానికి పట్టించండి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. దీంతో చర్మం
శుభ్రమైపోతుంది.
చందనంలో యాంటీ బయోటిక్‍ గుణం ఉంటుంది. అలాగే తన సహజమైన ఔషధ గుణాల కారణంగా గంధం మీ అందాన్ని మరింత పెంచుతుంది.
చందన లేపనం మొటిమలను తొలగించటంతో పాటు చర్మాన్ని శుభ్రం చేసి మృదుత్వాన్ని ప్రసాదిస్తుంది.
ఎలాంటి కురుపులు గాయాలు ఉన్నా గంధాన్ని రెగ్యులర్‍గా వాడి తొలగించవచ్చు.
గంధం పొడిలో నల్ల శనగల పొడి సమాన మోతాదులో కలిపి పాలు లేదా గులాబీ జలంతో ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచితే మొటిమలు
తొలగిపోతాయి.
చెమట ఎక్కువగా వస్తే గంధం పొడిలో నీళ్లు కలిపి దేహానికి రాసుకుంటే చెమట తగ్గుతుంది.
గంధం సువాసనను పీలిస్తే ఊపిరితిత్తులు క్రియాశీలవుతాయి.
గంధం తైలాన్ని స్ప్రే చేస్తే దేహానికి చల్లదనం అనుభూతి కలుగుతుంది.
సూర్య కిరణాలతో ప్రభావితమైన చర్మానికి చందనం వల్ల చల్లదనం, తాజాదనం లభిస్తాయి.
కొన్ని చుక్కల ‘గంధం తైలాన్ని’ రోజూ నీళ్లలో వేసి ఆ నీటితోనే స్నానం చేయండి. ఇది మీ చర్మానికి ఒక రక్షణ పొరలా ఉంటుంది.
గంధాన్ని రెగ్యులర్‍గా వాడటం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా కని పిస్తుంది.

Review చర్మానికి వరం చందనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top