లాలిపరమానంద రామగోవింద
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక జో అచ్యుతానంద జో అచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామగోవింద నందు నింటను జేరి నయముమీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి కావరంబున నున్న కంసుని బడగొట్టి నీవు మధురాపురము నేలజేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి జో అచ్యుతానంద జోజో




