చక్కా వచ్చాం చక్కగా వచ్చాం..
కుదురుగ పాపడూ కుదురుగ పాపడు గుమ్మడికాయ విరిసిన పాపడు విఘ్నేశాయ సాగిన పాపడు సాంబశివాయ చెలగిన పాపడు శ్రీకృష్ణాయ అందెల పాపడు ఆంజనేయాయ చెంగటి పాపడు శ్రీలోలాయ జోలిన పాపడు జోసూర్యాయ సందిట పాపడు సహచంద్రాయ తారుచు పాపడు తాతారాయ బొజ్జన్న పాపడు పూర్ణబ్రహ్మాయ ఆడిన పాపడు ఆనందాయ కృష్ణమ్మా వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు వూదే కృష్ణమ్మా ఆవుల కాసే కృష్ణమ్మ వీడే ముద్దుల కృష్ణమ్మ కాళ్లగజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి మెడలో దండలు చూడండి తలలో పింఛం చూడండి చదువులనిచ్చే కృష్ణమ్మా సంపదలిచ్చే కృష్ణమ్మా పాపల కాచే కృష్ణమ్మ బాలబంధుడీ కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు