చీమ మంచితనం
అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. చెట్టుపైన పిట్టగూడు. ఆ గూటిలో పావురాల జంట. ఆ పావురాలు రెండూ కలిసికట్టుగా ఆహారం కోసం వెళ్లేవి. తిరిగి చీకటి పడే వేళకు గూటికి చేరి ఊసులాడుకుంటూ ఒకదానికొకటి ఆహారం తినిపించుకునేవి. ఆ చెట్టు కింది పుట్టలో ఒక గండు చీమ. పాపం. అది ఒంటరిది. దానికి నా అనే వాళ్లెవరూ లేరు. రోజూ పావురాల జంట ఆనందంతో




