కుక్క చెప్పిన నీతి
రామాపురం అనే గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులున్నారు. వ్యవసాయ కుటుంబం కావటం వలన ఆవులు, గేదెలు, గొర్రెలతో పాటు కుక్కను, పిల్లిని కూడా పెంచు కుంటున్నాడు రామయ్య. ప్రతిరోజు పశువులను మేపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ పొలాలలోనే భార్యా, భర్త గడిపేవారు! రాత్రివేళకు ఇంటికి చేరి, సీతమ్మ వంటపని చేసేది. పగలంతా ఇంటిని కనిపెట్టుకొని కుక్క, ధాన్యం బస్తాలు ఎలుకల బారిన పడకుండా పిల్లి కాపలాకాసుకొని ఉండేవి. రామయ్య రాత్రి
