జిత్తుల మారి నక్క
శ్యామ్ అనే పేరు గల జిత్తులమారి నక్క ఒక అడవిలో నివసిస్తూ ఉండేది. దానికి స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క అందర్నీ మోసం చేస్తూ ఉంటుంది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా యీ నక్కతో కలియవు. స్నేహం చేయవు. దాని నుండి తప్పించుకుని తిరుగుతాయి. రాత్రి వేళ యితర జంతువుల్ని తన కూతతో భయపెడుతుంది. నిశ్శబ్దంగా ఉండే రాత్రిళ్లు దాని కూత వల్ల వేటికీ