సామెత కద
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఏదైనా ఒక పని చేయడానికి కొందరు చాలా హడావుడి చేస్తారు. ఏదో జరిగిపోతుందని, జరగబోతుందనే భావన కలిగిస్తారు. తీరా చివరికి వచ్చే సరికి ఏం తేల్చలేక తుస్‍మనిపిస్తారు. ఇటువంటి సందర్భాలలోనే ఎక్కువగా ఈ సామెతను వినియోగిస్తుంటారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ సామెత ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అవి చేస్తాం, ఇవి చేస్తాం అని నాయకులు ప్రకటించడం, చివరకు ఏం చేయలేక చేతులెత్తేయడం వంటి సందర్భాలకు ఇది