కీర దోస పకోడి కావాల్సినవి: కీరదోస- 1 (గుండ్రంగా కట్‍ చేసుకోవాలి), శనగపిండి- 4 లేదా 5 టేబుల్‍ స్పూన్లు, కారం- 1 టీ స్పూన్‍, జీలకర్ర పొడి- పావు టీ స్పూన్‍, నీళ్లు- అరకప్పు, బేకింగ్‍ సోడా- చిటికెడు, మసాలా- అర టీ స్పూన్‍, ఉప్పు- తగినంత, నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో శనగపిండి, కారం, జీలకర్ర పొడి, బేకింగ్‍

ఎవరు పేద

ఒకసారి ఒక పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. అతను బుద్ధుడిని ఇలా అడిగాడు ‘అయ్యా! నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను? నేనే ఎందుకిలా పుట్టాలి? నేనెందుకు పేదవాడను?’. బుద్ధుడు అతనికి శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు. ‘మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటు వంటి ఔదార్యం కలిగి లేరు. మీ జీవితంలో దాన ధర్మాలు చేసి ఎరుగరు. అందుకే ఇలా పేదవాడిగా పుట్టారు’. ‘నిజమే! నేను దాన ధర్మాలు చేయలేదు. కానీ, చేయడానికి నా

జ్ఞానార్జనకి వయస్సుతో నిమిత్తం లేదు

జీవితంలో చివరికంటా విజ్ఞానం, ధనం సంపాదిస్తూనే ఉండాలి, నలుగురికీ పంచుతూనే ఉండాలని, మరుక్షణం నాదికాదు - అనుకొని కర్తవ్యాలు నిర్వహించాలనీ సందేశమిచ్చే శ్లోకం ఇది. శ్లో।। అజరామరవత్‍ ప్రాజ్ఞో, విద్యామర్థం చ సాధయేత్‍ । గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్‍ ।। ‘‘వ•సలితనంగానీ, మరణంగానీ నాకు అంటదు’’, అనే భావనతో జ్ఞానాన్ని, ధనాన్ని నిరంతరం ఆర్జిస్తూనే వుండాలి. దానధర్మాల విష యంలో మాత్రం మృత్యువు జుట్టుపట్టుకొని లాగుతోందనే తొందరతో (ఇప్పుడే) వ్యవహరించాలి.

చిదంబర రహస్యమేమిటో!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. తంజావూరు సత్రం తంజావూరు రాజులు గొప్ప కళా

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షి చిట్టి పాప చిన్న మా అమ్మాయి శ్రీ ముఖము చూసి సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే పనసపండని జనులు పరుగులెత్తేరు దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే దోసపండని జనులు దోసిలొగ్గేరు నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు నిత్యమూ అమ్మాయి నీళ్లాడు

Top