నాగలోక ఉద్ధారకుడు అస్తీకుడు
రుషులు మన అర్ష్య ధర్మానికి ఆద్యులు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఆచారాలను, సంప్రదాయాలను ఎన్నెన్నో తప, యాగ, అధ్యయన ఫలాలుగా వారు మనకు ఒసగినవే. అందుకే మన మహర్షులు వివిధ అంశాలలో మనకు దారి చూసే మార్గదర్శకులు. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క గొప్పదనంతో ఈ




