కీర దోస పకోడి
కావాల్సినవి:
కీరదోస- 1 (గుండ్రంగా కట్‍ చేసుకోవాలి), శనగపిండి- 4 లేదా 5 టేబుల్‍ స్పూన్లు, కారం- 1 టీ స్పూన్‍, జీలకర్ర పొడి- పావు టీ స్పూన్‍, నీళ్లు- అరకప్పు, బేకింగ్‍ సోడా- చిటికెడు, మసాలా- అర టీ స్పూన్‍, ఉప్పు- తగినంత, నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో శనగపిండి, కారం, జీలకర్ర పొడి, బేకింగ్‍ సోడా, మసాలా, ఉప్పు ఒకదాని తరువాత మరొకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా కట్‍ చేసుకున్న ఒక్కో కీరదోస ముక్కనూ శనగపిండి మిశ్రమంలో కలిపి, నూనెలో
డీప్‍ ఫ్రై చేసుకుంటే.. కీర
దోస పకోడి రెడీ

పన్నీర్‍ బ్రెడ్‍ బాల్స్
కావాల్సినవి: బ్రెడ్‍ పౌడర్‍- ఒకటిన్నర కప్పులు పన్నీర్‍ ముద్ద- 1 ముద్ద. పన్నీర్‍ను ముందు మెత్తగా ఉడికించుకోవాలి.
మైదాపిండి- 2 టేబుల్‍ స్పూన్లు
కొత్తిమీర గుజ్జు- 1 టేబుల్‍
స్పూన్‍, పాలు- ముప్పావు కప్పుపైనే, జీడిపప్పు గుజ్జు- 3 టేబుల్‍ స్పూన్లు
అల్లం పేస్ట్- 1 టీ స్పూన్‍
మిరియాల పొడి- కొద్దిగా
పచ్చిమిర్చి పేస్ట్- 2 టీ స్పూన్లు
కారం- పావు టీ స్పూన్‍
ధనియాల పొడి- 1 టీ స్పూన్‍
ఉప్పు- తగినంత
నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా
తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో బ్రెడ్‍ పౌడర్‍, పన్నీర్‍, మైదాపిండి, కొత్తిమీర గుజ్జు, జీడిపప్పు గుజ్జు, అల్లం పేస్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసుకుని కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుని నూనెలో డీప్‍ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి.

రైస్‍ బాల్స్ విత్‍ కోకోనట్‍ మిల్క్
కావాల్సినవి:
బియ్యం పిండి- 1 కప్పు + 3 టీ స్పూన్లు
చిలగడదుంపల ముద్ద- అర కప్పు. దీనిని మెత్తగా ఉడికించి చేసుకోవాలి
మైదాపిండి- పావు కప్పు
నీళ్లు- కొద్దిగా
నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా
కొబ్బరిపాలు- ఒకటిన్నర కప్పులు
ఉప్పు- అర టీ స్పూన్‍
పంచదార- అర కప్పు
లేత కొబ్బరి గుజ్జు- ఒకటిన్నర కప్పులు
త•యారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‍ తీసుకుని అందులో బియ్యంపిండి, చిలగడ దుంపల ముద్ద, మైదాపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తరువాత చిన్న చిన్న బాల్స్ చేసుకుని మరుగుతున్న నూనెలో డీప్‍ ఫ్రై చేసుకోవాలి.
నూనెలో నుంచి తీస్తూనే చల్లని వాటర్‍లో వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత మళ్లీ స్టవ్‍ ఆన్‍ చేసుకుని, మరో పాత్ర తీసుకుని అందులో కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, పంచదార, లేత కొబ్బరి గుజ్జు ఒకదాని తరువాత ఒకటి రెండు మూడు నిమిషాలు గ్యాప్‍ ఇస్తూ గరిటెతో తిప్పుతూనే వేసుకోవాలి. చివరిగా రైస్‍

Review .

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top